బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు
- హుటాహుటీన కరీంనగర్ నుంచి హైదరాబాద్ తరలింపు
- గచ్చిబౌలిలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స
- స్టంట్ వేసి ఐసీయూలో చికిత్స అందిస్తున్న వైద్యులు
కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ తల్లి శకుంతల గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన కరీంనగర్ నుంచి హైదరాబాద్కు తీసుకువచ్చారు. ఆమెను గచ్చిబౌలిలోని మెడికవర్ ఆసుపత్రిలో చేర్పించారు. శకుంతల గుండెకు వైద్యులు స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
బండి సంజయ్ కూడా మెడికవర్ ఆసుపత్రికి చేరుకున్నారు. తల్లి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. శకుంతలకు గుండెపోటు రావడంతో బండి సంజయ్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజులుగా బండి భగీరథ్ పోక్సో కేసు మీడియాలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.